బీజేపీదే బంగారు భవిష్యత్‌

ABN , First Publish Date - 2022-07-02T05:23:25+05:30 IST

తెలంగాణలో 2023 నుంచి బీజేపీతోనే రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు దక్కుతుందని మాజీ కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌ వెల్లడించారు.

బీజేపీదే బంగారు భవిష్యత్‌
సాతాపూర్‌లో ఇంటింటికి తిరిగి నరేంద్రమోదీ బహిరంగ సభకు తరలి రావాలని ప్రజలకు వివరిస్తున్న రాధాకృష్ణన్‌

- మోదీ సభను దిగ్విజయం చేద్దాం  

- మాజీ కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌ 


కొల్లాపూర్‌/పెద్దకొత్తపల్లి/తెలకపల్లి/అచ్చంపేట, జూలై 1: తెలంగాణలో 2023 నుంచి బీజేపీతోనే రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు దక్కుతుందని మాజీ కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌ వెల్లడించారు. శుక్ర వారం కొల్లాపూర్‌ పట్టణంలోని లోటస్‌మాన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ హైద రాబాద్‌లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని విజయవంతం చేయడంతోపాటు ఈ నెల 3న జరిగే మోదీ సభకు కొల్లాపూర్‌ నుంచి దాదాపు 7వేల మంది కమలం సైనికులు తరలివెళ్లేలా కృషి చేస్తున్నట్లు వెల్ల డించారు. శుక్రవారం నియోజకవర్గస్థాయి బూత్‌ అధ్యక్షులతో, బీజేపీ నాయకులతో మోదీ సభ సంస్థాగ తంగా విజయవంతం చేసేందుకు రవాణా, భోజన వ సతి అంశాలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాక ర్‌రావుతో కలిసి నాయకులు, కార్యకర్తలు చర్చించారు. అనంతరం రాధాకృష్ణన్‌తోపాటు కొల్లాపూర్‌ నియోజక వర్గానికి పార్టీ నియమించిన మేడ్చల్‌ నియోజకవర్గ అభ్యర్థి మోహన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ రావులు మోదీ విజయ సంకల్పయాత్ర వాల్‌పోస్టర్లను, ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు.  దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి జలాల శివుడు, కిసాన్‌మోర్చా అధికారి ప్రతినిధి తమటం శేఖర్‌గౌడ్‌, మహిళా మోర్చా అధికారి ప్రతినిధి కొమరి రోజారమణి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మూలే భరత్‌చంద్ర, మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎండి.సలీం, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కడ్తాల కృష్ణయ్య, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

 

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలో కి రావడం ఖాయమని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌ దీమా వ్యక్తం చేశారు.  3వ తేదీన హైదరాబాద్‌లోని సికింద్రబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెద్దకొ త్తపల్లి మండలంలోని కల్వకోల్‌, సాతాపూర్‌ గ్రామాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావుతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించా రు.  బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి శశిరేఖ, బీజపీ మండల అధ్యక్షుడు పదిర భీమేష్‌, జిల్లా నాయకులు జలాల్‌ శివుడు, కడ్తాల కృష్ణయ్య, మండల నాయకులు తిరుమల్‌యాదవ్‌, జింకల వెంకటస్వామి, అమ్మపల్లి మల్లేష్‌, ప్రవీణ్‌కుమార్‌యాదవ్‌, అంజి, మల్లేష్‌, మద్దిలేటి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


బహిరంగ సభను విజయవంతం చేయండి

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధా ని నరేంద్రమోదీ సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని గు జరాత్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌భాయ్‌ పటేల్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రాకొండ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు.  అసెంబ్లీ ఇన్‌చార్జి దిలీప్‌, మండల ఇన్‌చార్జి అలాస్మండల, ఇన్‌చార్జి పోల్‌దాసు రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజావర్ధన్‌రెడ్డి, జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు రమణారెడ్డి, పార్లమెంట్‌ కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొత్తపల్లి రవికు మార్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బాలుసాగర్‌, బచ్చిరెడ్డి, అపర్ణ, కొండ నగేష్‌, మణెమ్మ, ఎత్తపు రవి, రాజేష్‌గౌడ్‌, శివ, వెంకటేశ్‌, కృష్ణ, బీజేవైఎం అధ్యక్షుడు వెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి రాజశేఖ ర్‌, ఆంజనేయులు, భాస్కర్‌గౌడ్‌, శ్రీశైలం, రవిగౌడ్‌, వెంకట్‌రెడ్డి, విష్ణు, రాజు, లక్ష్మణ్‌, బూత్‌ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. 


 కేసీఆర్‌ చేతుల్లో దగాపడుతున్న తెలంగాణ 

 ఎనిమిది ఏళ్లుగా కేసీఆర్‌ చేతుల్లో తెలంగాణ రాష్ట్రం దగా పడుతోందని జమ్మూకశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమం త్రి నిర్మల్‌ కుమార్‌సింగ్‌  అన్నారు. తె లంగాణ సంపర్గ అభియాన్‌లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్‌హాలులో బీజేపీ బూ త్‌లెవల్‌ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కమిటీల నాయకు లతో ‘పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లా లి’ అనే అంశాలపై సుదీర్ఘంగా చ ర్చించారు. అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, అ మలు కాని హామీలపై క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి 2023 అధికారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప థకాలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వ నిధుల ను తమ పథకాలకు బదలాయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు ఇబ్బందులకు గురౌతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతీ కార్యకర్త కేంద్ర ప్రభుత్వ పథకాల కరపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చే యాలని కోరారు.  బీజేపీ నాయకుడు రాష్ట్ర కోఆర్డినేట ర్‌ వీరెల్లి చంద్రశేఖర్‌,  మంగ్యానాయక్‌, రేణయ్య, సతీ ష్‌మాదిగ, బాలాజి, రవీందర్‌రెడ్డి, జానకి, శ్రీనునాయక్‌, రామోజి, సైదులు యాదవ్‌, రామేశ్వర్‌రావు, చందుశివ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-07-02T05:23:25+05:30 IST