దేశ విలువలను కించపరుస్తున్న బీజేపీ

ABN , First Publish Date - 2022-08-14T04:23:05+05:30 IST

దేశంలో కుల విభజన తెచ్చి, దేశ విలువలను కించపరిచేలా బీజేపీ పాలన చేస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

దేశ విలువలను కించపరుస్తున్న బీజేపీ
మదనపల్లె పట్టణంలో ఆజాద్‌ కా గౌరవ్‌ యాత్రలో కాంగ్రె్‌స పార్టీ నాయకులు

స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రె్‌స పార్టీ నాయకులదే కీలకపాత్ర

ఆజాద్‌ కా గౌరవ్‌ యాత్రలో పీసీసీ ఉపాధ్యక్షుడు షాజహాన్‌బాషా


మదనపల్లె రూరల్‌, ఆగస్టు 13: దేశంలో కుల విభజన తెచ్చి, దేశ విలువలను కించపరిచేలా బీజేపీ పాలన చేస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శనివారం పట్టణంలోని బెంగళూరు బస్టాండు సర్కిల్‌లోని ఇందిరమ్మ విగ్రహానికి కాంగ్రె్‌స పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి, పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు చేపట్టిన ఆజాద్‌ కా గౌరవ్‌ యాత్ర పేరుతో మదనపల్లె నుంచి రాయచోటి వరకు అట్టహాసంగా పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రె్‌స పార్టీ నాయకులే కీలకపాత్ర వహించారన్నారు. ఎంతోమంది ప్రాణాలు సైతం అర్పించి దేశానికి స్వాతంత్య్రం తెస్తే నేడు బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ వ్యవస్థలను, విలువలను నాశనం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతోందన్నారు. నేడు బడుగు, బలహీనవర్గాల ప్రజలందరిపై అన్ని రకాల వస్తువులపై పన్నుల భారాలు మోపుతోందన్నారు. కాంగ్రె్‌స పార్టీ హయాంలో దేశంలోను, రాష్ట్రంలో అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించగా నేడు బీజేపీ ప్రభుత్వం దానిని దిగజార్చుతోందన్నారు. మదనపల్లె నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. నేడు ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించడం లేదని, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తెలియజేయడానికే ఈ ఆజాద్‌ కా గౌరవ్‌ యాత్ర పేరుతో కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు మేరకు పాదయాత్ర చేపట్టామన్నారు. ఈ యాత్రను మదనపల్లె నుంచి రాయచోటి వరకు 80 కిలోమీటర్లు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రె్‌స పార్టీ నాయకులు షంషీర్‌, గిరీష్‌, నాగూర్‌వలీ, రెడ్డిసాహెబ్‌, ఇంతియాజ్‌, వేమయ్య, జబీ, నజీర్‌, శంకర్‌నాయుడు, కిట్టన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T04:23:05+05:30 IST