దళిత బంధుకు బీజేపీ వ్యతిరేకం

ABN , First Publish Date - 2021-10-20T04:48:44+05:30 IST

దళిత బంధుకు బీజేపీ వ్యతిరేకమని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. మంగళవారం నిజాంసాగర్‌ దళిత వాడలో ఆయన దళిత బంధు పథకంపై అవగాహన కల్పించారు.

దళిత బంధుకు బీజేపీ వ్యతిరేకం


జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే
నిజాంసాగర్‌, అక్టోబరు 19 : దళిత బంధుకు బీజేపీ వ్యతిరేకమని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. మంగళవారం నిజాంసాగర్‌ దళిత వాడలో ఆయన దళిత బంధు పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితు ల ఉద్దరణ కోసమే సీఎం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు.. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా ఏ సీఎం కూడా ఇలాంటి ఆలో చన చేయలేదన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి దళితబంధు అమలు చేస్తే బీజేపీ నాయకులు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి దళితబంధును నిలిపివేయించడం విడ్డూరంగా ఉందన్నారు. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి, ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి తెలంగాణను సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలానికి ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించిందని, 1800 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం వేస్తుందని తెలిపారు. దళితుల బాగోగుల కోసం యూనిట్లను నెలకొల్పుకోవాలన్నారు. అనంతరం సీఎం సహాయ నిధి మం జూరు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్‌ గం గారెడ్డి, ఏఎంసీ ఉపాధ్యక్షుడు గైని విఠల్‌, వై.నారాయణ, సర్పంచులు సంగ మేశ్వర్‌ గౌడ్‌, అంజయ్య, మాజీ సర్పంచులు రాజు, నాయకులు, కార్యకర్తలున్నారు.

Updated Date - 2021-10-20T04:48:44+05:30 IST