హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాలపై బీజేపీ దృష్టిసారించింది. 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలపై ఆర్గనైజింగ్ వర్క్ షాపు నిర్వహించింది. నగరంలోని ప్రముఖ హోటల్‌లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. అభ్యర్థుల గుర్తింపు, ఎస్సీ నియోజకవర్గాలలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. దళితబంధు అమలుతో పాటు దళితులకు కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటంపై ప్రణాళిక రూపొందించనున్నారు. మాజీ మంత్రులు విజయరామారావు, ఏ చంద్రశేఖర్, బాబుమోహన్, వివేక్, ఎస్. కుమార్, బంగారు శృతి, కొప్పు భాష, పలువురు ఎస్సీ మేధావులు సమావేశానికి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి