Abn logo
Aug 26 2021 @ 19:16PM

బీజేపీ ఏం చెప్పి హుజూరాబాద్‌ ప్రజలను ఓట్లు అడుగుతుంది: హరీష్

వీణవంక: బీజేపీ ఏం చెప్పి హుజూరాబాద్‌ ప్రజలను ఓట్లు అడుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లిలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ వ్యవస్థలను కూలదోస్తుందని, రోడ్డు మార్గాలు, నౌకశ్రయాలను, రైల్వేలను కుదవ పెడుతోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంతో అచ్చేదిన్‌ కాదు.. సచ్చే దిన్‌ వచ్చిందని అనే ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అమ్మకానికి... టీఆర్‌ఎస్‌ నమ్మకానికి మరో రూపమన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అసహనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ నాయకులంతా హుజూరాబాద్‌కు వచ్చి ప్రచారం చేస్తున్నారని ఈటల అనడం సరికాదన్నారు. పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా ప్రచారం చేయవచ్చని హరీష్‌రావు అన్నారు.