యూపీలో మళ్లీ BJPయే : ఏబీపీ -సీ వోటర్ సర్వే

ABN , First Publish Date - 2021-09-04T02:42:43+05:30 IST

యూపీలో తిరిగి బీజేపీ ప్రభుత్వమే విజయం సాధిస్తుందని ‘ఏబీపీ-సీ వోటర్ సర్వే’ లో తేలింది. అయితే ఈసారి గతంలో వచ్చిన సీట్ల

యూపీలో మళ్లీ BJPయే : ఏబీపీ -సీ వోటర్ సర్వే

లక్నో : యూపీలో తిరిగి బీజేపీ ప్రభుత్వమే విజయం సాధిస్తుందని ‘ఏబీపీ-సీ వోటర్ సర్వే’ లో తేలింది. అయితే ఈసారి గతంలో వచ్చిన సీట్ల కంటే తక్కువ సీట్లను సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. ‘ఏబీపీ-సీ వోటర్ సర్వే’ ప్రకారం బీజేపీ 259 సీట్ల నుంచి 267 సీట్లను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది. ఇక అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి 109 నుంచి 117 సీట్లను సాధిస్తుందని సర్వే తేల్చింది. ఇక బీఎస్పీకి 12 నుంచి 16 సీట్లు, కాంగ్రెస్‌కు 3 నుంచి 7 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది. 

Updated Date - 2021-09-04T02:42:43+05:30 IST