Abn logo
Oct 25 2021 @ 02:48AM

ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొడుతున్న బీజేపీ

  • కరీంనగర్‌ జిల్లా మాచనపల్లిలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
  • ప్రజలకు చేసిందేంటో ఆ పార్టీ నేలు చెప్పడం లేదు
  • స్వార్థం కోసమే ఈటల రాజీనామా చేశారు: హరీశ్‌రావు


జమ్మికుంట రూరల్‌, అక్టోబరు 24: ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టడమే బీజేపి నాయకులు పనిగా పెట్టుకున్నారని హరీశ్‌రావు అన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. బీజేపీ నేతలు మాత్రం ప్రజలకు ఏం చేశారో చెప్పడం లేదని, గెలిస్తే ఏం చేస్తారో కూడా చెప్పడం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అడ్డగోలుగా పెంచుతోందని, పైగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగం వల్లే పెట్రో ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్తున్నారన్నారు. తాను కిషన్‌రెడ్డికి మళ్లీ సవాల్‌ విసురుతున్నానని, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా తాను, కేంద్ర మంత్రిగా ఆయన చర్చకు సిద్ధమా చెప్పాలని డిమాండ్‌ చేశారు.


పెరిగిన ధరలు తగ్గిస్తామని ఎక్కడైనా బీజేపీ నాయకులు చెప్తున్నారా అని ప్రశ్నించారు. ఈటల తన స్వార్థ రాజకీయాల కోసం టీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారని విమర్శించారు. ఉగాది తర్వాత మొత్తం రైతుల రుణమాఫీ చేస్తామని, త్వరలో 60 వేల నుంచి 70వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనది ఆయన అన్నారు.