Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 26 2021 @ 18:11PM

తాలిబన్ల తరహాలో బీజేపీ పాలన: అభిషేక్ బెనర్జీ

కోల్‌కతా: కేంద్రంలోని మోదీ సర్కార్, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలనపై టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌ పరిస్థితిని చూస్తే తాలిబాన్ తరహా పాలన సాగుతోందని ఆయన అన్నారు. కోల్‌కతాలో ఆదివారంనాడు జరిగిన ఓ కార్యక్రమంలో అభిషేక్ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లో ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛా లేదని అన్నారు. ప్రతీ నిర్ణయం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంతంగా తీసుకుంటారని అన్నారు. బయట వ్యక్తులకు తల వంచకుండా అత్యంత సాహసోపేతంగా పోరాడుతున్న ఏకైక పార్టీ టీఎంసీ మాత్రమేనని చెప్పారు. త్రిపుర, అసోంకు చేరామని, రాబోయే రోజుల్లో గోవా కూడా వెళ్తామని చెప్పారు. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. రాజకీయ పోరాటానికి టీఎంసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

మమతకు పిలుపువచ్చినా అడ్డుకున్నారు...

ప్రపంచ శాంతి సమావేశానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వానం వచ్చినప్పటికీ, మోదీ కంటే మమతకు ఎక్కువ జనాదరణ ఉన్న కారణంగానే ఆమెను వెళ్లకుండా అడ్డుకున్నారని కేంద్రంపై అభిషేక్ బెనర్జీ విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement