కడప జిల్లా: బద్వేల్ ఉపఎన్నికపై బీజేపీ ఫోకస్

ABN , First Publish Date - 2021-10-03T18:54:56+05:30 IST

బద్వేల్ ఉప ఎన్నికకు జనసేన దూరంగా ఉండడంతో బీజేపీ సై అంటోంది.

కడప జిల్లా: బద్వేల్ ఉపఎన్నికపై బీజేపీ ఫోకస్

కడప జిల్లా: ఏపీలో జెండా పాతేందుకు కాషాయిదళం ప్లాన్ చేస్తోంది. బద్వేల్ ఉప ఎన్నికకు జనసేన దూరంగా ఉండడంతో బీజేపీ సై అంటోంది. ఎన్ని ఓట్లు వస్తాయన్నది ముఖ్యంకాదని, పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. బద్వేల్‌లో ఓట్లు సాధిస్తే కేడర్‌లో జోష్ నింపొచ్చనే కమలదళం అంచనావేస్తోంది.


జాతీయ స్థాయిలో బీజేపీ ఎంత బలంగా ఉన్నా.. ఏపీలో మాత్రం బోణి కొట్టలేకపోయింది. ఇప్పుడు కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో కాషాయిదళం ఫోకస్ పెట్టింది. ఏపీలో ఓటమి, ఓట్ల శాతాన్ని అంచనా వేసుకుని వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లాలనుకుంటోంది. బద్వేల్ బై పోల్‌లో పోటీపై రెండు రోజుల క్రితం విజయవాడలో పవన్ కల్యాణ్, నాదేండ్ల మనోహర్‌తో రాష్ట్ర బీజేపీ నేతలు చర్చించారు. బద్వేల్‌లో తామే బరిలోకి దిగుతామని జనసేన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. అయితే వెంకట సుబ్బయ్య సతీమణికి వైసీపీ టిక్కెట్ ఇవ్వడంతో పోటీ చేయొద్దని జనసేన భావించింది. జనసేన ప్రకటనతో బీజేపీ సందిగ్ధంలో పడింది. దీంతో కడప జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్యనేతలతో ఢిల్లీ నాయకుడొకరు మాట్లాడారు. ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-10-03T18:54:56+05:30 IST