ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి పరాజయమే: గుత్తా

ABN , First Publish Date - 2022-01-13T01:48:55+05:30 IST

వ్యవసాయ నల్లచట్టాలు తెచ్చిన బీజేపీకి వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి జోస్యం చెప్పారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి పరాజయమే: గుత్తా

మిర్యాలగూడ: వ్యవసాయ నల్లచట్టాలు తెచ్చిన బీజేపీకి వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు కన్నెర్ర చేస్తే పాలన పతనం కాక తప్పదని హెచ్చరించారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్‌.. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలిపారని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేస్తే ‘అలీబాబా చాలీస్‌ చోర్‌’లాగా ఆ పార్టీ లీడర్లు ఒక్కొక్కరు వచ్చి తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అతీగతీ లేదని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ను ఆడిపోసుకోవడం తప్ప వేరే పనేమీ లేదని విమర్శించారు. దేశానికి కేసీఆర్‌ నాయకత్వం వహించాలని, పాలనలో గుణాత్మక మార్పు రావాలని ఆకాక్షించారు. రైతులంతా సంఘటితంగా ఉండి కేసీఆర్‌కు మద్దతుగా నిలబడాలని సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2022-01-13T01:48:55+05:30 IST