హైదరాబాద్: తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ మోసం చేస్తోందని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. నీళ్ల పేరుతో తెలంగాణను దోపిడీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ సమావేశాలతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. బీజేపీ బలపడడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు.