నరక దారులు..

ABN , First Publish Date - 2020-12-06T05:46:21+05:30 IST

రోడ్ల నిర్మాణం చేపట్టాలంటూ బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో శనివారం నాడు ఆ పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు.

నరక దారులు..
చింతలపూడి బోసుబొమ్మ సెంటర్లో రాస్తారోకో..

 బీజేపీ నాయకుల ఆందోళనలు

రోడ్ల మరమ్మతులకు డిమాండ్‌

 రోడ్ల నిర్మాణం చేపట్టాలంటూ బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో శనివారం నాడు ఆ పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు. గోతుల రోడ్లలో పడి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారని, వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తక్షణం రోడ్లు నిర్మించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

చింతలపూడి, డిసెంబరు 5: అధ్వానంగా ఉన్న రోడ్లను బాగుచేయాలంటూ బీజేపీ నాయకులు స్థానిక బోసుబొమ్మ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ఎం. దుర్గామణికుమార్‌ మాట్లాడుతూ చింతలపూడి– ఏలూరులోని రహదారులన్నీ భారీ గోతులతో 50 కిలోమీటర్ల ప్రయాణం 3 నుంచి 4 గంటలు పడుతోందన్నారు. వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని ఇంత జరుగుతున్నా అధికారులు కనీసం గోతులు పూడ్చ డం లేదని, వర్షాలు తగ్గినప్పటికీ మరమ్మతులు చేయడానికి అడ్డంకులేమిటని ప్రశ్నించారు. రాస్తారోకోలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు తోట వెంకట నారాయణ, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షుడు మోహన్‌రావు, కిసాన్‌ మోర్చ అధ్యక్షుడు వర ప్రసాద్‌, జనసేన అధ్యక్షుడు శివ తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: రహదారులు అధ్వానంగా ఉండటంతో ప్రజలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారని పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని ప్రధాన రహదారుల్లో, రూరల్‌ పార్టీ ఆధ్వర్యంలో దేవులపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం నిరసన తెలిపారు. సీఎం గారూ.. గుంతలు పడిన రోడ్లు వెంటనే మరమ్మతులు చేయించాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి తదితర నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేశారు.  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్జుల మురళీ, పట్టణ అధ్యక్షుడు పర్వతం రాధాకృష్ణ  తదితరులు పాల్గొన్నారు. 

కామవరపుకోట: మండలంలో రహదారులు గోతులమయమై రాకపోకలకు   ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారని, వెంటనే రోడ్ల నిర్మాణా లు చేపట్టాలని  బీజేపీ కామవరపుకోట మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం కొత్తూరు–కామవరపుకోట మార్గమధ్యంలో పాడైన రోడ్ల వద్ద  రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఏసువరప్రసాద్‌, కాకి సురేష్‌కుమార్‌, మండల కిసాన్‌ మోర్చ అధ్యక్షులు లక్ష్మీ సూర్యనారాయణ రాజు, జనసేన అధ్యక్షుడు బొబ్బిలి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.  

జీలుగుమిల్లి: పి.అంకంపాలెం వద్ద పాడైన రహదారిపై బీజెపీ ఎస్టీ మొర్చా రాష్ట్ర కార్యదర్శి మొడియం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించి రోడ్లు నిర్మించాలంటూ నిరసన తెలిపారు.  గిరిజన గ్రామాల్లో రోడ్లు పాడవటంతో కనీసం ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేక పోతున్నాయన్నారు. పలువురు రోడ్డు ప్రమాదాలకు గురై  ప్రాణాలు కోల్పో యిన సంఘటనలున్నాయన్నారు.  నియోజకవర్గ ఎమ్మెల్యే సమస్యపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు.   పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్‌,  అన్నవరం, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కొయ్యలగూడెం:  అధ్వాన రహదారులకు మోక్షం కల్పించాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిశోర్‌ డిమాండ్‌ చేశారు.  శనివారం ప్రధాన సెంటర్‌లో నిరసన చేపట్టారు. ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితిలో రహదారులు ఉన్నాయని, వాహనాలు గోతుల్లోపడి అనేక ప్రాణాలు కొల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు సుభద్రాదేవి, మండల  అధ్యక్షురాలు మల్లీశ్వరి పాల్గొన్నారు. 

టి.నరసాపురం: రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారులను పునర్ని ర్మించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాట్రాతి యుగంధర్‌ డిమాండ్‌ చేశారు.  బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో  ర్యాలీ నిర్వహించి ఎంపీడీవో కామే శ్వరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుగంధర్‌ మాట్లాడుతూ  ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారులు వేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.  యువమోర్చ రాష్ట్ర  నాయకుడు చాట్రాతి శేషగిరిరావు,  పార్టీ మండల అధ్యక్షుడు   హరిబాబు తదితరులు పాల్గొన్నారు. 

ద్వారకాతిరుమల: రహదారులపై గోతులను పూడ్చాలని మండలంలోని జి. కొత్తపల్లి, దూబచర్ల మార్గమధ్యంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తాండ్ర శేషుబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న రోడ్లకు తక్షణం మరమ్మతులు చేయకుంటే  ఆందోళన మరింత  ఉధృతం చేస్తామని  హెచ్చరించారు.    బీజేపీ మండల అధ్యక్షుడు  గణపతి తదితరులు పాల్గొన్నారు.

కొవ్వూరు: అధికార పార్టీ నిర్లక్ష్యంతో రహదారులు అధ్వానంగా తయారయ్యాయని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బోడపాటి ముత్యాలరావు ఆరోపించారు. శనివారం   కొవ్వూరు–ఏలూరు రహదారిపై  స్థానిక గోదావరి మాత విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహి ంచారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణం మరమ్మతులకు గురైన రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  పిల్లలమర్రి మురళీకృష్ణ, గన్నమని భాస్కరరావు, కరుటూరి జగన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T05:46:21+05:30 IST