సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ లింగయ్యయాదవ్
బీజేపీ ఓటమి ఓటమి ఖాయం : బడుగుల
నిడమనూరు, జనవరి 17: త్వరలో జరగనున్న ఐ దు రాషా్ట్రల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమ ని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవా రం స్థానిక మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే భగత్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతు వ్యతిరేక విధానాలు అ వలంబిస్తున్న బీజేపీ పతనం మొదలైందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌పై బీ జేపీ నాయకులు ఓర్వలేక అభాండాలు వేస్తున్నారని దు య్యబట్టారు. కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని కొ నియాడారు. ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ నియోజకవ ర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ పంచాయతీకి మంజూరయ్యే రూ.20లక్షల నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్, బొల్లం రవి, మాచర్ల దాసు, ఎం. వెంకటయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.