ఏపీ మంత్రి కొడాలి వ్యాఖ్యల కలకలం.. బీజేపీ కౌంటర్

ABN , First Publish Date - 2020-08-11T01:58:11+05:30 IST

బీజేపీపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఓ న్యూస్ ఛానల్‌కు...

ఏపీ మంత్రి కొడాలి వ్యాఖ్యల కలకలం.. బీజేపీ కౌంటర్

విజయవాడ: బీజేపీపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడాలి నాని మాట్లాడుతూ.. ఇండియాలో పుట్టిన కరోనా ఒకటుందని, అది బీజేపీ అని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ను, కమ్యూనిస్టులను కలిపి తినేస్తోందని, త్రిపురలో కాంగ్రెస్‌ను తినేస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. బీజేపీ అనే కరోనాకి ఇది అది అని ఏం లేదని, అది తగులుకుంటే తినేస్తోందని బీజేపీపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఆల్‌రెడీ వచ్చిందని, బాగా మాస్క్‌‌లు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని కొడాలి నాని వ్యాఖ్యానించారు.


మంత్రి కొడాలి చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ మండిపడింది. మంత్రి కొడాలి నాని బీజేపీని కరోనాతో పోలుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీజేవైఎమ్ ప్రకటించింది. త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో ఒక గొప్ప శక్తిగా ఎదిగిన పార్టీ బీజేపీ అని ట్వీట్ చేసింది. అవినీతి, కుటుంబ పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను పట్టిపీడిస్తున్న టీడీపీ, వైసీపీ లాంటి ప్రాంతీయ వైరస్‌లకు దేశవ్యాప్త వ్యాక్సిన్ బీజేపీ అని ట్వీట్ చేసింది.

Updated Date - 2020-08-11T01:58:11+05:30 IST