విజయవాడ: దేశంలో బీజేపీ పతనానికి పునాదులు పడడం ప్రారంభమైందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఉన్న స్థానాలను కోల్పోవడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని చెప్పారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ గొప్ప విజయాలేమీ సాధించలేదని కొట్టిపారేశారు. బీజేపీ పతనానికి సూచికలు వస్తుండడంతో సంఘ్ పరివార్ మళ్లీ మతోన్మాదాన్ని పైకి తీస్తోందని విమర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల ఊరేగింపుల్లో సంఘ్‌పరివార్ కార్యకర్తలు ఆయుధాలతో హల్‌చల్ చేశారని రాఘవులు ఆరోపించారు.