‘నాకు హిందీ తెలీదు’

ABN , First Publish Date - 2022-04-10T15:43:23+05:30 IST

‘నాకు హిందీ తెలీదు’ అంటూ బీజేపీ కార్పొరేటర్‌ ఉమా ఆనంద్‌ చేసిన వ్యాఖ్యలకు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) కౌన్సిల్‌ సమావేశంలో నవ్వులు విరిశాయి. స్థానిక జీసీసీ కార్యాలయ భవనం

‘నాకు హిందీ తెలీదు’

                    - జీసీసీ కౌన్సిల్‌ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్‌


పెరంబూర్‌(చెన్నై): ‘నాకు హిందీ తెలీదు’ అంటూ బీజేపీ కార్పొరేటర్‌ ఉమా ఆనంద్‌ చేసిన వ్యాఖ్యలకు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) కౌన్సిల్‌ సమావేశంలో నవ్వులు విరిశాయి. స్థానిక జీసీసీ కార్యాలయ భవనం రిప్పన్‌ భవనంలో శనివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై చర్చ సమయంలో మాట్లాడిన బీజేపీ కార్పొరేటర్‌ ఉమా ఆనంద్‌, ‘నమస్కారం, ఇంగ్లీషు, తమిళం భాషల్లో మాట్లాడతాను సభ్యులు క్షమించాలి’ అని విజ్ఞప్తి చేశారు. అప్పుడు కొందరు డీఎంకే సభ్యులు ‘హిందీలో మాత్రం మాట్లాడొద్దు’ అని పేర్కొనడంపై, ఉమా ఆనంద్‌ స్పందిస్తూ ‘నాకు హిందీ తెలీదు’ అని చెప్పారు. దీంతో కౌన్సిల్‌ సమావేశంలో నవ్వులు విరిశాయి.

Updated Date - 2022-04-10T15:43:23+05:30 IST