Abn logo
Oct 5 2021 @ 16:59PM

గుజరాత్‌లో బీజేపీ క్లీన్ స్వీప్.. 44 స్థానాల్లో 41 కైవసం

అహ్మదాబాద్: గుజరాత్‌లోని గాంధీనగర్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 44 స్థానాలున్న గాంధీ నగర్‌ మున్సిపాలిటీలో బీజేపీ 41 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాగా కాంగ్రెస్ రెండు స్థానాలు, ఆప్ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఆదివారం పోలింగ్ జరగ్గా మంగళవారం ఉదయం లెక్కింపు ప్రారంభమైంది. అంతిమ ఫలితాలు విడుదలయ్యే నాటికి ముందస్తు అంచనాలను నిజం చేస్తూ బీజేపీ అత్యధిక మెజారిటీతో మున్సిపాలిటీని కైవలం చేసుకుంది.


ఫలితాల అనంతరం.. గుజరాత్ భారతీయ జనతా పార్టీ అధినేత సీఆర్ పాటిల్ మాట్లాడుతూ ‘‘బీజేపీ నేతలకు ప్రజలతో క్షేత్ర స్థాయిలో ఎంతటి అనుబంధం ఉందో ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆప్‌ను ప్రజలు తిరస్కరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై గుజరాత్ ప్రజలకు ఉన్న విశ్వాసం ఏంటనేది ఈ ఫలితాలతో మరోసారి రుజువైంది’’ అని అన్నారు. కాగా, గాంధీనగర్ మున్సిపాలిటీలోని 11 వార్లుల్లో ఉన్న 44 స్థానాలకు 162 అభ్యర్థులు పోటీకి దిగారు.