విజయవాడ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు. ఎనికేపాడు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేవలం రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపు అనుమతించారు. దీంతో కార్లు, బైకులన్నీ అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి.. అనంతరం అక్కడ నుంచి విజయవాడకు బయలుదేరారు. రెండు రోజుల పాటు ఏపీలో జరగనున్న ఆశీర్వాద్ యాత్రలో కేంద్ర మంత్రి పాల్గొంటారు.