రేపు హైదరాబాద్‌లో పోలీస్‌స్టేషన్ల ముట్టడికి BJP పిలుపు

ABN , First Publish Date - 2022-06-07T19:24:45+05:30 IST

జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో జరుగుతోన్న అవకతవకలకు నిరసనగా బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది.

రేపు హైదరాబాద్‌లో పోలీస్‌స్టేషన్ల ముట్టడికి BJP పిలుపు

హైదరబాద్: జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో జరుగుతోన్న అవకతవకలకు నిరసనగా బీజేపీ(BJP) పోరుబాటకు సిద్ధమైంది. రేపు నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ముందు నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని బీజేపీ అంటోంది. పోలీసులే నిందితులకు కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారని కమలం పార్టీ ఆరోపించింది.

Updated Date - 2022-06-07T19:24:45+05:30 IST