డ్రామా కంపెనీకి ఓనర్లు కేసీఆర్‌, కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-03-05T05:29:53+05:30 IST

డ్రామా కంపెనీకి ఓనర్లు కేసీఆర్‌, కేటీఆర్‌

డ్రామా కంపెనీకి ఓనర్లు కేసీఆర్‌, కేటీఆర్‌
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

పోడు రక్షణకు ఆదివాసీ గిరిజనులకు భరోసా

సంపాదన కోసం కేసీఆర్‌ ఇంట్లో లొల్లి

కేంద్రం నిధులు దారి మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఎమ్మెల్సీ ఎన్నికలతో కేసీఆర్‌కు రాజకీయ సమాధి

నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న ప్రేమేందర్‌రెడ్డి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

మహబూబాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : అబద్దాల కోరు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌లు డ్రామా కంపెనీకి ఓనర్లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఏక్‌ నెంబర్‌ కేసీఆర్‌ అయితే దస్‌ నెంబర్‌ కేటీఆర్‌ అని, ప్రతి రోజు అబద్దాలు, మోసపూరిత మాటలతో ప్రజలను మ భ్యపెడుతూ.. అధికారం చెలాయిస్తున్నారని, ఇక వారి ఆటలు సాగవని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో టీఆర్‌ఎస్‌ పతనం ఆరంభం కానుందని, అది ఉద్యమగడ్డ మానుకోట నుంచే మొదలవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తరుఫున మహబూబాబాద్‌ జిల్లాలో గురువారం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్‌లో  పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన బండి సం జయ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదవీ పొగానే శాశ్వతంగా జైలులోనే ఉంటాడని, అందుకోసం ఇప్పట్నుంచే ఫామ్‌హౌస్‌లో ఉంటూ జైలు జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతికి కేరాఫ్‌ ముఖ్యమంత్రి అని, ఆయనకు తెలియకుండానే పీఆర్వో అవినీతికి పాల్పడ్డాడా అని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ గుర్తోస్తుందని, 2014లోనే ఎన్డీఏ ప్ర భుత్వం ఫ్యాక్టరీని మంజూరు చేస్తే తెలంగాణ ప్రభు త్వం స్థలం కేటాయించకపోవడంతో వేరే రాష్ట్రానికి తరలిపోయిందని, ఈ విషయాన్ని మభ్యపెట్టి కేంద్రంపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. 

సీఎం కేసీఆర్‌ రాజకీయ సమాధి..

ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తే మార్చి 14 ఎమ్మెల్సీ ఎన్నికలతో సీఎం కేసీఆర్‌ను రాజకీయ సమాధి చేయడానికి మేధావి వర్గం సిద్ధంగా ఉందని బండి సంజయ్‌ అన్నారు. సీఎం పద వీ చెప్పుతో సమానం అని రాజ్యాంగ పదవీని అవమానపరిచిన కేసీఆర్‌కు ఓట్లేస్తే అహంకారం పెరిగిపోతుందని, పట్టభద్రులు, మేధావులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గుర్రంపాడు తండాలో పోడు భూముల రక్షణ కోసం గిరిజనులకు మద్దతుగా నిలిచింది బీజేపీయేనని, ఆదివాసీ గిరిజనులకు భూములు దక్కెలా తెలంగాణ ప్రభుత్వంపై యుద్దం చేస్తామని ప్రకటించారు. కేసీఆర్‌ ఇంట్లో ప్రతిరోజు సంపాదన కోసం కొట్లాట జరుగుతోందని, కేటీఆర్‌, సంతోష్‌, కవితల మధ్య ఆర్థిక కొట్లాట ఉంటుందని, వీటిని పట్టించుకోకుండ సీఎం ఇళ్లు వదిలి ఫాంహౌ్‌సకు పోతున్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీ ఏ మాతానికి వ్యతిరేకం కాదని, మతమార్పిడికి మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో కేసీఆర్‌ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. మేధావులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసి రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.  

జిల్లాలో విస్తృత ప్రచారం..

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి గెలుపును కోరుతూ.. మహబూబాబాద్‌ జిల్లాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని పెద్దవంగర వద్ద కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో పర్యటించి మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈదులపూసపల్లి శివార్లలో ఘనస్వాగతం పలికారు. అక్కడ్నుంచి ఓపెన్‌టా్‌ప జీప్‌పై భారీ ర్యాలీగా నందన గార్డెన్‌కు చేరుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో  ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యేండల లక్ష్మీనారాయణ, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్‌నాయక్‌, జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాంచందర్‌రావు, రాష్ట్ర నాయకులు బంగారు శృతి, ఎడ్ల అశోక్‌రెడ్డి, వి.రాజవర్థన్‌రెడ్డి, సంగప్ప, యాప సీతయ్య, ఎల్ది మల్లయ్య, వల్లబు వెంకటేశ్వర్లు, చీకటి మహేష్‌, సిరికొండ సంపత్‌, పెద్దగాని సోమయ్య, గుగులోతు లక్ష్మణ్‌నాయక్‌, బీబీ.రాఘవులు, మోసంగి మురళి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, మాధవపెద్ది శశివర్థన్‌రెడ్డి, చుక్కల నరేష్‌, ఆకుల శ్రీనివాస్‌, పసుపులేటి నవీన్‌నాయుడు, సాయిని ఝూన్సీరవి, నల్లాని పాపారావు, వాసు, గట్టుదేవి, పొదిల నర్సింహారెడ్డి, కొమ్మాల వెంకట్‌రెడ్డి, భూక్య బాలునాయక్‌, వోలం శ్రీనివాస్‌, గాంతి వెంకట్‌రెడ్డి, ఖాసీం, బొట్టు రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-05T05:29:53+05:30 IST