West Bengalలో బీజేపీ ప్రముఖుల వెనుకంజ

ABN , First Publish Date - 2021-05-02T16:34:23+05:30 IST

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం

West Bengalలో బీజేపీ ప్రముఖుల వెనుకంజ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 10.34 గంటలకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ ప్రముఖులు బబుల్ సుప్రియో, స్వపన్ దాస్‌గుప్తా, రాహుల్ సిన్హా, లాకెట్ ఛటర్జీ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూటమి 117 స్థానాల్లోనూ, టీఎంసీ కూటమి 146 స్థానాల్లోనూ ముందంజలో కనిపిస్తున్నాయి. వామపక్ష కూటమి అభ్యర్థులు ముగ్గురు ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు ముగ్గురు ముందంజలో ఉన్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో మమత బెనర్జీపై సువేందు అధికారి (బీజేపీ) 8 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఉదయం 10.11 గంటలకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. 


కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి బబుల్ సుప్రియో టోలీగంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై టీఎంసీ అభ్యర్థి, రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి అరూప్ బిశ్వాస్ 9,800 ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో ఉన్నారు. 


బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ చుంచుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె టీఎంసీ అభ్యర్థి అసిత్ మజుందార్ కన్నా వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. తారకేశ్వర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి స్వపన్ దాస్ గుప్తా తన సమీప ప్రత్యర్థి, టీఎంసీ అభ్యర్థి రామేందు సిన్హా రాయ్ కన్నా వెనుకబడినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా హబ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా తన సమీప ప్రత్యర్థి, టీఎంసీ అభ్యర్థి కన్నా వెనుకబడినట్లు సమాచారం. 


ఇదిలావుండగా ఉదయం 11 గంటలకు అందిన సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 182 స్థానాల్లోనూ, బీజేపీ 94 స్థానాల్లోనూ ఆధిక్యంలో కనిపిస్తున్నాయి. 


Updated Date - 2021-05-02T16:34:23+05:30 IST