కోవిడ్-19: ఎంపీలకు కొత్త టాస్క్ అప్పజెప్పిన బీజేపీ

ABN , First Publish Date - 2020-04-09T21:17:48+05:30 IST

కోవిడ్-19 లాక్‌డౌన్ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ చేపట్టిన సహాయక కార్యక్రమాలు...

కోవిడ్-19: ఎంపీలకు కొత్త టాస్క్ అప్పజెప్పిన బీజేపీ

న్యూఢిల్లీ: కోవిడ్-19 లాక్‌డౌన్ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ చేపట్టిన సహాయక కార్యక్రమాలు, నిర్ణయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలంటూ తమ పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలను బీజేపీ కోరింది. కోవిడ్-19ను అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న చర్యలపై ప్రజల్లోకి వెళ్లి తెలియజేయాలనీ.. వార్తా పత్రికలు, సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించింది. ఈమేరకు ఇప్పటికే బీజేపీ తమ ఎంపీలందరీకి లేఖ రాసింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. దీని ద్వారా సంభవించే ఆర్ధిక ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కునేందుకు కేంద్రం ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.


ఏడాది పాటు పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లలో 30 శాతం కోత విధిస్తూ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. 2020-21 నుంచి 2021-22 మధ్య రెండేళ్ల పాటు ఎంపీల్యాడ్స్ నిధులను తాత్కాలికంగా నిలిపివేసింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కార్మికులు, వలస కూలీలకు మేలు చేకూర్చే విధంగా ప్రధానమంత్రి కళ్యాణ యోజన పేరుతో 1.70 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. 

Updated Date - 2020-04-09T21:17:48+05:30 IST