కాకినాడ: అమలాపురం ఘటనను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఖండించారు. కొనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైందన్నారు. అమలాపురం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అమలాపురం ఘటన నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. అమలాపురం ఆందోళనలో బీజేపీ శ్రేణులు పాల్గొనరని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి