Abn logo
Sep 25 2021 @ 00:25AM

బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు తగవు: సీపీఎం

సభలో మాట్లాడుతున్న అంగేరి పుల్లయ్య

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 24: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27న చేపట్టనున్న బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణ సీపీఎం కార్యాలయంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా, ప్రభుత్వరంగ సంస్థల విక్రయానికి వ్యతిరేకంగా బంద్‌ జరుగుతున్నట్లు పుల్లయ్య గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు జనమాల గురవయ్య, గంధం మణి, గురవయ్య, శివకుమార్‌, కూలి రవి, చందమామల కోటయ్య, మల్లి, శ్రీనివాసులు, ధనంజయ, ఈశ్వరయ్య, అన్వర్‌బాషా పాల్గొన్నారు.