BJP announces: లోక్‌సభ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ)తో బీజేపీ పొత్తు

ABN , First Publish Date - 2022-08-01T18:29:38+05:30 IST

వచ్చే 2024 లోక్‌సభ(Lok Sabha), 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar assembly elections) సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) నేతృత్వంలోని జేడీ(యూ)తో(JDU) బీజేపీ(BJP) పొత్తును కొనసాగించాలని...

BJP announces: లోక్‌సభ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ)తో బీజేపీ పొత్తు

న్యూఢిల్లీ : వచ్చే 2024 లోక్‌సభ(Lok Sabha), 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar assembly elections) సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) నేతృత్వంలోని జేడీ(యూ)తో(JDU) బీజేపీ(BJP) పొత్తును కొనసాగించాలని బీజేపీ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్(National general secretary of the BJP, Arun Singh) వెల్లడించారు. బీజేపీ, జేడీ(యూ)తో తెగతెంపులు చేసుకుంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరుణ్ సింగ్ ఈ మేర ప్రకటన చేశారు. 


తమ బీజేపీకి జేడీ(యూ)తో ఎలాంటి విబేధాలు లేవని, పొత్తు ధర్మాన్ని పాటిస్తామని, వచ్చే ఎన్నికల్లో తాము జేడీ(యూ)తోనే కలిసి పనిచేస్తామని అరుణ్ సింగ్ వివరించారు.భవిష్యత్ లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ జేడీ(యూ)తో తాము కలిసి పోటీ చేస్తామని కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్(Union Minister and BJP leader Giriraj Singh) కూడా ప్రకటించారు.


Updated Date - 2022-08-01T18:29:38+05:30 IST