లేదు.. లేదంటూనే...!

ABN , First Publish Date - 2022-02-18T16:43:04+05:30 IST

అన్నాడీఎంకే, బీజేపీల ఒంటరిపోరు ప్రయోగమే తప్ప, ఆ రెండు పార్టీల నడుమ ఎలాంటి సమస్యల్లేవని మరోమారు నిరూపితమైంది. పొత్తు లేదులేదంటూనే ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకోవడం

లేదు.. లేదంటూనే...!

- బీజేపీకి అన్నాడీఎంకే సహకారం

- కమలం పార్టీ అభ్యర్థులకు మాజీ మంత్రి విజయభాస్కర్‌ ప్రచారం


అడయార్‌(చెన్నై): అన్నాడీఎంకే, బీజేపీల ఒంటరిపోరు ప్రయోగమే తప్ప, ఆ రెండు పార్టీల నడుమ ఎలాంటి సమస్యల్లేవని మరోమారు నిరూపితమైంది. పొత్తు లేదులేదంటూనే ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకోవడం బహిరంగమైంది. గురువారం అన్నాడీఎంకే మాజీ మంత్రి విజయభాస్కర్‌ ఇందుకు కారణమయ్యారు. గురువారం పుదుకోటలో బీజేపీ అభ్యర్థుల తరపున మాజీ మంత్రి విజయభాస్కర్‌ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని కీరమంగళం పట్టణ పంచాయతీ 10వ వార్డులో బీజేపీ తరపున పోటీ చేస్తున్న సుమతి, 11వ వార్డు బీజేపీ అభ్యర్థి రాజామణిలను గెలిపించాలని కోరుతూ ఆయన ప్రచారం చేశారు. ఈ వ్యవహారం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-02-18T16:43:04+05:30 IST