బీజేపీ, టీఆర్‌ఎ్‌సలది అధికార దర్పం

ABN , First Publish Date - 2022-08-14T06:09:01+05:30 IST

దేశ స్వాతంత్య్రం కోసం పో రాడిన కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచేందుకు కేంద్రంలో బీజేపీ, రా ష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీలు అధికార దర్పం ప్రదర్శిస్తున్నాయని సీఎ ల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎ్‌సలది అధికార దర్పం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి

సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి 

మిర్యాలగూడ టౌన, ఆగస్టు 13: దేశ స్వాతంత్య్రం కోసం పో రాడిన కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచేందుకు కేంద్రంలో బీజేపీ, రా ష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీలు అధికార దర్పం ప్రదర్శిస్తున్నాయని సీఎ ల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో నిర్వహించిన ఆజాదీకా గౌరవ్‌ యాత్రలో జానారెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ త్యాగాల తో స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. 75ఏళ్ల స్వతంత్య్ర భారతం లో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించడం హర్షణీయమన్నారు.  స్వాతంత్య్ర సమరయోధుల సుదీర్ఘ పోరాటంలో దేశానికి విముక్తి లభించిందని, అదే జరగకుంటే ప్రస్తుతం ప్రధానిగా మోదీ, సీఎంగా కేసీఆర్‌ ఉండేవారు కాదని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో దేశ మా నవ సూచీ కనిష్ఠస్థాయికి చేరి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. సాధారణ, ఉప ఎన్నికల సందర్భాల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లోపించిందన్నారు. ఎన్నికల గడియలు దగ్గరపడుతున్న తరుణంలో తామెక్కడ మునిగిపోతామోనన్న భావన సీఎం కేసీఆర్‌లో కనిపిస్తుందని పే ర్కొన్నారు. ఎన్నికల భయంతో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ముం దుస్తుగా పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు. ఇతర పార్టీలను బలహీనపరుస్తున్న పీఎం, సీఎంలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. కాంగ్రె్‌స పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత శంకర్‌నా యక్‌, మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి, కిసానసెల్‌ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, చిరుమరి కృష్ణ య్య, సలీం, రామలింగయ్య, కాంతారెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T06:09:01+05:30 IST