ఒడిశాలో బీజేడీ ఘన విజయం.. 30 జిల్లాలూ కైవసం

ABN , First Publish Date - 2022-03-14T02:33:24+05:30 IST

బీజేడీ తర్వాత భారతీయ జనతా పార్టీ 42 స్థానాలు గెలుచుకుంది. ఇక మూడవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలను సాధించింది. స్వతంత్రులు, ఇతర పార్టీలు కలిపి ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగాయి. ఈ విజయం అనంతరం బీజేడీ అధినేత..

ఒడిశాలో బీజేడీ ఘన విజయం.. 30 జిల్లాలూ కైవసం

భుబనేశ్వర్: ఒడిశాలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ బిజూ జనతా దళ్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. రాష్ట్రంలోని 30 జిల్లాలనూ బీజేడీ కైవసం చేసుకుంది. మొత్తం 852 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో తుది ఫలితాలు విడుదలయ్యే నాటికి 766 స్థానాలు బీజేడీ ఖాతాలో పడిపోయాయి. ఇతర పార్టీలన్నీ మిగతా స్థానాల్లో తమ వాటాను పంచుకున్నాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎక్కువ స్థానాల్లో గెలవలేకపోయారు. 90 శాతం సీట్లను బీజేడీ గెలిచి ఘనమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.


బీజేడీ తర్వాత భారతీయ జనతా పార్టీ 42 స్థానాలు గెలుచుకుంది. ఇక మూడవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలను సాధించింది. స్వతంత్రులు, ఇతర పార్టీలు కలిపి ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగాయి. ఈ విజయం అనంతరం బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందిస్తూ.. తమపై ఉన్న నమ్మకాన్ని ఇంత పెద్ద విజయంతో చూపించినందుకు ఒడిశా ప్రజలకు కృతజ్ణతలు తెలియజేశారు.


కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, పనితీరు ఒడిశా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయని.. పెరిగిన నిత్యవసర ధరలు, ద్రవ్యోల్బణం, ఇతర కొన్ని కారణాల వల్ల ముఖ్యంగా ఒడిశా గ్రామీణ ప్రాంతం ప్రజలు భారతీయ జనతా పార్టీపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయని అంటున్నారు. వీటికి వ్యతిరేకంగా బీజేడీ పోరాడుతోందని, బీజేడీ పార్టీ ప్రస్తుతం సామాజిక ఉద్యమంగా మారిందన బీజేడీ ప్రధాన కార్యదర్శి ప్రణబ్ ప్రకాష్ దాస్ ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయంటూ కొందరు విశ్లేషకులు అంటున్నారు.

Updated Date - 2022-03-14T02:33:24+05:30 IST