సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు..

ABN , First Publish Date - 2022-06-23T16:40:48+05:30 IST

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వింత జీవికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. సముద్రం ఒడ్డున రాళ్లపై కుళ్లిన స్థితిలో ఉన్న ఆ జీవి ఫొటోలు చూసి.. నెటిజన్లు రకరకాలు రియాక్ట్ అవుతున్నారు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు..

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వింత జీవికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.  సముద్రం ఒడ్డున రాళ్లపై కుళ్లిన స్థితిలో ఉన్న ఆ జీవి ఫొటోలు చూసి.. నెటిజన్లు రకరకాలు రియాక్ట్ అవుతున్నారు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


సూదులు వంటి పళ్లను కలిగి చూడటానికి వింతగా కనిపించే జీవికి సంబంధించిన ఫొటోలను అమెరికాకు చెందిన క్రిస్టీన్ టిలోట్సన్ అనే మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓరెగాన్ రాష్ట్రంలోని మిల్ బీచ్‌లో ఉన్న రాళ్లపై తనకు ఇది కనిపించినట్లు పేర్కొన్నారు. అదేంటో గుర్తించాలని ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నార్త్ అమెరికాలో కనిపించే వోల్ఫ్ ఈల్ అయి ఉంటుందని కొందరు పేర్కొంటే మరికొందరేమో దాన్ని ఖండిస్తూ కామెంట్ చేశారు. అయితే చిట్టవరకు అది మంకీఫేస్ ప్రికిల్‌బ్యాక్ ఈల్‌కు సంబంధించిన అవశేషం అనే విషయం బయటపడింది. క్రిస్టీన్ టిలోట్సన్ కూడా దీన్ని అంగీకరించారు. తొలుత తాను దాన్ని మంకీఫేస్ ప్రికిల్‌బ్యాక్ ఈల్‌‌గా గుర్తించలేకపోయినట్టు వెల్లడించారు. 




Updated Date - 2022-06-23T16:40:48+05:30 IST