Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కాకరకాయ పెరుగు కర్రీ

కాకరకాయ పెరుగు కర్రీ

కావలసినవి: కాకరకాయలు - ఎనిమిది, పెరుగు - అరకప్పు, పసుపు - అర టీస్పూన్‌, అల్లం పొడి - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, మెంతులు - అర టీస్పూన్‌, ఆవాల నూనె - పావు కప్పు.


తయారీ: ముందుగా జీలకర్ర, మెంతులను వేగించాలి. కాకరకాయలపై గరుకుగా ఉన్న పొట్టు తీసేసి, ముక్కలను ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలను పిండి నీటిని తీసేస్తే చేదు పోతుంది. పాత్రలో పెరుగు తీసుకొని అందులో పసుపు, కారం, వేగించిన జీలకర్ర, మెంతులు, ఉప్పు, ఇంగువ వేసి కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడయ్యాక కాకరకాయలు వేసి కాసేపు వేగించుకుని పక్కన పెట్టాలి. అదే పాన్‌లో కాస్త నూనె వేసి పెరుగు మిశ్రమం వేయాలి. తరువాత కాకరకాయ ముక్కలు వేసి కలుపుకొని వేగించాలి. ఉడుకుతున్న సమయంలో మధ్యమధ్యలో కలియబెడితే రుచికరమైన పెరుగు కర్రీ రెడీ అవుతుంది. అన్నంలోకి ఈ కర్రీ రుచిగా ఉంటుంది.

సోయా కర్రీసోయా కర్రీఛోలే గుత్తి వంకాయ ఛోలే గుత్తి వంకాయ మామిడికాయ - పెరుగు పులుసుమామిడికాయ - పెరుగు పులుసుములక్కాడల కూరములక్కాడల కూరక్యాబేజీ చనా దాల్‌క్యాబేజీ చనా దాల్‌శ్రీలంక వంకాయకూరశ్రీలంక వంకాయకూరఆవాల ఆకుల కర్రీ ఆవాల ఆకుల కర్రీ కాజూ మసాలా కాజూ మసాలా ఆలూ మేతీఆలూ మేతీసాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌సాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.