కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలో నిర్వహిస్తున్న ‘గడపగడప మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. మాజేరు గ్రామంలో పథకాలు గురించి వివరించబోయిన ఎమ్మెల్యేకు కొందరు ఎస్టీ, బీసీ మహిళలు ఫిర్యాదు చేశారు. ఇళ్ళు కాలిపోయి 3 సంవత్సరాలయినా పట్టించుకోలేదని మొరపెట్టుకున్నారు. ఇల్లు కట్టించి ఇస్తామని ఎప్పుడో చెప్పి, ఇప్పుడు కట్టుకోమంటే ఎలా? అని వారు ప్రశ్నించారు. రోడ్లు సరిగా లేక బురదలో తమపిల్లలు స్కూల్ కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎస్సీ కాలనీ మహిళలు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి