అనకాపల్లి: ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు (Baburao)కు చేదు అనుభవం ఎదురైంది. రాయవరం మండలం లింగ రాజుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో తనకు ఇల్లు ఎందుకు రాలేదో చెప్పాలని ఎమ్మెల్యేను ఓ వృద్ధురాలు ప్రశ్నించింది. తనకన్నా అర్హత లేనివారికి ఇల్లు ఎలా కేటాయించారో చెప్పాలని పట్టుబట్టింది. దీంతో ఎమ్మెల్యే వృద్ధురాలికి సమాధానం చెప్పలేక సతమతమయ్యారు.
ఇవి కూడా చదవండి