సచివాలయ తనిఖీలో ప్రభుత్వ విప్‌కు చేదు అనుభవం

ABN , First Publish Date - 2021-10-19T06:11:00+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగులను గాడిలో పెట్టేందుకు తనిఖీకి వెళ్లిన ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డికి చే దు అనుభవం ఎదురైంది.

సచివాలయ తనిఖీలో ప్రభుత్వ విప్‌కు చేదు అనుభవం
సచివాలయానికి తాళాలు వేయడంతో బయటే నిల్చుని ఎంపీడీఓతో ఫోనలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి

తాళాలు వేసి మధ్యాహ్నానికే ఉద్యోగులు ఖాళీ


డీ హీరేహాళ్‌, అక్టోబరు 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగులను గాడిలో పెట్టేందుకు తనిఖీకి వెళ్లిన ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డికి చే దు అనుభవం ఎదురైంది. సోమవారం ఆయన మండలంలోని ఓబుళాపురం గ్రామ సచివాలయ ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. అయితే మధ్యాహ్నానికే సచివాలయ సిబ్బంది కార్యాల యానికి తాళాలు వేసి ఖాళీ చేశారు. దీంతో ఖంగుతున్న విప్‌ కార్యాలయం వద్ద ఉన్న స్థా నికులను విచారించారు. మధ్యాహ్నం మూడు గంటలకే సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లిపోయారని తెలిపారు. దీంతో కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఎం పీడీవో భాస్కర్‌తో ఫోన్లో మాట్లాడారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచివాల య సిబ్బందిపై చర్యల నిమిత్తం నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు సరెండర్‌ చేయాలని ఆదేశించారు. అంతలోనే సమాచారం అందుకున్న సచివాలయ సిబ్బంది హుటాహుటిన కార్యా లయానికి చేరుకుని తలుపులు తెరిచారు. అనంతరం ప్రభుత్వ విప్‌ సచివాలయంలో రికా ర్డులను తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో వుంటూ సేవలందించాల్సిన సిబ్బంది ని ర్లక్ష్యంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 


Updated Date - 2021-10-19T06:11:00+05:30 IST