షాకిచ్చిన చైనా.. బిట్ కాయిన్ విలువ పతనం!

ABN , First Publish Date - 2021-06-21T04:51:54+05:30 IST

అంతకంతకూ పెరిగిపోతున్న చైనా ప్రభావం తాజాగా బిట్ కాయిన్‌పై కూడా పడింది. కొత్త బిట్ కాయిన్‌లను వెలికితీసే క్రిప్టో మైనింగ్ ప్రక్రియను చైనా నిలిపివేయడంతో బిట్ కాయిన్ విలువ ఏకంగా 5.5 శాతం మేర పతనమైంది.

షాకిచ్చిన చైనా.. బిట్ కాయిన్ విలువ పతనం!

వాషింగ్టన్: అంతకంతకూ పెరిగిపోతున్న చైనా ప్రభావం తాజాగా బిట్ కాయిన్‌పై కూడా పడింది. కొత్త బిట్ కాయిన్‌లను వెలికితీసే క్రిప్టో మైనింగ్ ప్రక్రియను చైనా నిలిపివేయడంతో బిట్ కాయిన్ విలువ ఏకంగా 5.5 శాతం మేర పతనమై 35 వేల డాలర్లకు చేరుకుంది. ఈ ప్రక్రియకు విద్యుత్ వినియోగం అధికమవుతోందన్న కారణంగా క్రిప్టోమైనింగ్ ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ చైనా ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారి చేసింది. వివిధ రకాల పజిల్స్‌కు సమాధానాలు వెదకడం ద్వారా కొత్త బిట్ కాయిన్లను వెలికితీయవచ్చు. దీన్నే క్రిప్టో మైనింగ్ అంటారు. పజిల్స్ అత్యంత సంక్లిష్టంగా ఉండటంతో దీనికి భారీగా కంప్యూటర్లను వినియోగించాల్సి వస్తుంది. ఫలితంగా విద్యుత్ వినియోగం ఆకాశాన్నంటుతుంది. విద్యుత్ ఉత్పత్తికి శిలాజ ఇంధనాలే ప్రధాన ఆధారం కావడంతో ఇది గ్రీస్ హౌస్ వాయువుల విడుదలకు దారి తీసి పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. 

Updated Date - 2021-06-21T04:51:54+05:30 IST