blackbuck killed by Salman Khan: సల్మాన్‌ఖాన్‌ కృష్ణజింకను చంపిన స్థలంలో స్మారకం

ABN , First Publish Date - 2022-08-13T17:40:18+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌(Bollywood actor Salman Khan) కృష్ణజింకను(blackbuck) చంపిన ఘటన...

blackbuck killed by Salman Khan: సల్మాన్‌ఖాన్‌ కృష్ణజింకను చంపిన స్థలంలో స్మారకం

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌(Bollywood actor Salman Khan) కృష్ణజింకను(blackbuck) చంపిన ఘటన జరిగి నేటికి 24 సంవత్సరాలైంది. జోధ్‌పూర్ జిల్లా కంకణి గ్రామంలో సల్మాన్ ఖాన్ జరిపిన కాల్పుల్లో కృష్ణజింక నేలకొరిగిన స్థలంలోనే దాని గౌరవార్థం ఓ భారీ స్మారకాన్ని(build memorial honouring blackbuck) బిష్ణోయ్ కమ్యూనిటీ(Bishnoi community) ప్రజలు నిర్మిస్తున్నారు. కంకణి గ్రామంలో బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు జింకలను ప్రేమగా చూస్తుంటారు. కంకణి గ్రామంలో( Kankani village) జింక చనిపోయిన ప్రదేశంలోని 7 బిఘాల భూమిలో కృష్ణ జింక స్మారక చిహ్నంతోపాటు జింకల సంరక్షణ కేంద్రాన్ని గ్రామస్థులు నిర్మిస్తున్నారు. 


సిమెంటు, ఇనుప కడ్డీలతో 3 అడుగుల ఎత్తుగల కృష్ణ జింక విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు జంతువులు, పక్షుల చికిత్స కోసం ఒక రెస్క్యూ సెంటరును కూడా సిద్ధం చేస్తున్నారు.కంకణి గ్రామస్థులు విరాళాలు వేసుకొని కృష్ణ జింక స్మారకాన్ని నిర్మిస్తున్నారు.జోధ్‌పూర్‌లోని శివంచి గేట్‌లో స్థానిక శిల్పి శంకర్ 15 రోజుల్లో విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. కృష్ణ జింక విగ్రహంపై ఉంచేందుకు నిజమైన కొమ్ములను మరణించిన జింకల నుంచి సేకరించారు. రాబోయే తరాల వారికి జంతువుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ జింక స్మారకాన్ని నిర్మిస్తున్నామని కంకణి గ్రామవాసులు చెప్పారు.


‘‘జింకలు మానవ మనుగడకు ఎంతో అవసరం, తమ తల తెగిపోయినా, తాము మాత్రం జంతువులను, పర్యావరణాన్ని పరిరక్షించేదుకు సిద్ధంగా ఉంటాం’’ అని బిష్ణోయ్ సమాజ్ ప్రతినిధి, మాజీ ఎంపీ జస్వంత్ సింగ్ బిష్ణోయ్(Former MP and representative of Bishnoi Samaj Jaswant Singh Bishnoi) చెప్పారు.‘‘సల్మాన్ ఖాన్ కంకణి గ్రామంలో కృష్ణజింకను చంపినప్పుడు, అప్పటి నుంచి ప్రజలు జింకల సంరక్షణ కోసం స్మారకం కావాలని డిమాండ్ చేస్తున్నారు, తద్వారా ప్రజలు జంతువులను సంరక్షించడం నేర్చుకుంటారు’’ అని కంకణి గ్రామ నివాసి హనుమాన్ రామ్ విష్ణోయ్ చెప్పారు. తమ గ్రామ సందర్శనకు వచ్చే పర్యాటకులు సల్మాన్ కృష్ణజింకను చంపిన ప్రదేశాన్ని అడుగుతున్నారని, అందుకే ఇప్పుడు అదే స్థలంలో యువకులు జింక స్మారకాన్ని నిర్మిస్తున్నారని రామ్ చెప్పారు.


కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధ్‌పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.1998లో తన సినిమా 'హమ్ సాథ్ సాథ్ హై' షూటింగ్ సమయంలో జోధ్‌పూర్‌లో రెండు కృష్ణజింకలను చంపిన కేసులో దోషిగా తేలిన సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది.మిగిలిన నలుగురు నిందితులైన నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రే ఈ కేసులో నిర్దోషులుగా విడుదలయ్యారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ఆయుధాల చట్టానికి సంబంధించిన తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించారని ఆరోపిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం(Rajasthan government) దాఖలు చేసిన పిటిషన్‌ను జోధ్‌పూర్ జిల్లాసెషన్స్ కోర్టు అంతకుముందు కొట్టివేసింది.

 

Updated Date - 2022-08-13T17:40:18+05:30 IST