కావలసినవి : రాగి పిండి - ఒక కప్పు, బేకింగ్‌సోడా - అర టీస్పూన్, బెల్లం తురుము - పావుకప్పు, అవిసెలు - ఒక టేబుల్‌స్పూన్, నెయ్యి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, ఉప్పు - చిటికెడు.
తయారీ విధానం: ముందుగా అవిసెలను గోరు వెచ్చని నీళ్లలో నానబెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. తరువాత నెయ్యి, బెల్లం, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. నానబెట్టిన అవిసెలను వేసి మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. పలుచగా ఉన్నట్లయితే మరికొద్దిగా రాగి పిండి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ అరచేతిలో బిస్కెట్లు ఒత్తుకోవాలి.ఈ బిస్కెట్లను బేకింగ్ ట్రేలో పెట్టి 160 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పదినిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చల్లారిన తరువాత జాడీలో భద్రపరుచుకొని పిల్లలకు స్నాక్స్‌గా అందించవచ్చు.