అమెరికాలో భారతీయుల ‘పౌరసత్వ’ ప్రసవాలు

ABN , First Publish Date - 2022-07-04T14:11:17+05:30 IST

అమెరికాలో ఉంటున్న భారతీయులు స్వదేశానికి ఓ ఘనత సాధించిపెట్టారు. 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమెరికాలో జన్మించిన విదేశీయుల పిల్లల జాబితాలో భారత్‌ను రెండో స్థానంలో నిలబెట్టారు. ఈ జాబితాలో మెక్సికో అగ్రస్థానంలో ఉంది. తల్లిదండ్రులు విదేశీయులైనా అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆ దేశ పౌరసత్వం..

అమెరికాలో భారతీయుల ‘పౌరసత్వ’ ప్రసవాలు

వాషింగ్టన్‌, జూలై 3: అమెరికాలో ఉంటున్న భారతీయులు స్వదేశానికి ఓ ఘనత సాధించిపెట్టారు. 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమెరికాలో జన్మించిన విదేశీయుల పిల్లల జాబితాలో భారత్‌ను రెండో స్థానంలో నిలబెట్టారు. ఈ జాబితాలో మెక్సికో అగ్రస్థానంలో ఉంది. తల్లిదండ్రులు విదేశీయులైనా అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. అమెరికాయేతర తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల జాబితాలో మెక్సికో (24,508), భారత్‌(12,928), ఫిలిప్పీన్స్‌(11,316), క్యూబా(10,689), డొమినికన్‌ రిపబ్లిక్‌(7,046) వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. 


Updated Date - 2022-07-04T14:11:17+05:30 IST