కోట్లు తెచ్చిపెట్టిన పుట్టిన‌రోజు కానుక !

ABN , First Publish Date - 2020-06-06T13:17:59+05:30 IST

ఆ దంపతులది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌. ఒకప్పుడు బాగానే బతికినా.. ప్రస్తుతం పదవీవిరమణ చేసి ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కోట్లు తెచ్చిపెట్టిన పుట్టిన‌రోజు కానుక !

క్వీన్స్‌లాండ్‌, జూన్‌ 5: ఆ దంపతులది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌. ఒకప్పుడు బాగానే బతికినా.. ప్రస్తుతం పదవీవిరమణ చేసి ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో.. భర్త పుట్టినరోజుకు కానుకగా సరదాగా ఓ లాటరీ టికెట్‌ను కొని ఇచ్చింది. అయితే.. ఆ కానుక వారి జీవితంలో మరచిపోలేనిదవుతుందని ఆమె ఊహించలేదు. ఆ టికెట్‌కు ఏకంగా రూ. 2.6కోట్ల లాటరీ తగిలింది మరి! ఈ వార్త వినగానే వారికి చాలాసేపు నోట మాట రాలేదు. తేరుకున్న తర్వాత భార్య స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. చిపిండాల్స్‌ న్యూస్‌ ఏజెన్సీ వద్ద శనివారం గోల్డ్‌ లోటో టికెట్‌ను కొనుగోలు చేశానని  పేర్కొంది. మొత్తం దేశవ్యాప్తంగా పది టికెట్లు రూ.2.6 కోట్లు గెలుచుకుంటే, అందులో తమదీ ఒకటని హర్షం వ్యక్తం చేసింది. 

Updated Date - 2020-06-06T13:17:59+05:30 IST