Sep 29 2021 @ 01:36AM

లైగర్‌ సెట్‌లో బర్త్‌డే వేడుకలు

విజయ్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్‌’. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ‘లైగర్‌’ సెట్‌లో చిత్రబృందం సమక్షంలో మంగళవారం పూరి జగన్నాథ్‌ పుట్టిన రోజు ఘనంగా నిర్వహించారు. విజయ్‌ దేవరకొండతో పాటు ‘లైగర్‌’ సహ నిర్మాత చార్మి బర్త్‌డే కేక్‌ కటింగ్‌లో పాల్గొన్నారు.