Abn logo
Feb 25 2021 @ 12:11PM

పాల్ఘార్‌లో బర్డ్ ఫ్లూ కలవరం...చికెన్ దుకాణాల మూసివేత

పాల్ఘార్ (మహారాష్ట్ర): మహారాష్ట్రలో కరోనా మహమ్మారికి తోడు బర్డ్ ఫ్లూ కూడా వ్యాపించడంతో ప్రజలు కలవరపడుతున్నారు. పాల్ఘార్ జిల్లాలో ఎవియన్ ఇన్‌ఫ్లూఎంజాతో 45 కోళ్లు మరణించాయి. బర్డ్ ఫ్లూ సోకడంతో పాటు కోళ్లు మరణిస్తుండటంతో ముందుజాగ్రత్తగా పౌల్ట్రీఫాంలు, చికెన్ దుకాణాల్లో 21 రోజుల పాటు చికెన్ అమ్మకాలను నిలిపివేశారు.పాల్ఘార్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రబలడం వల్ల 21 రోజుల పాటు చికెన్ దుకాణాలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశామని డిప్యూటీ కలెక్టరు కిరణ్ మహాజన్ చెప్పారు. గత మూడురోజులుగా మరణించిన కోళ్ల నమూనాలను పూణే లాబోరేటరికీ పంపించగా బర్డ్ ఫ్లూ వల్లనే కోళ్లు మరణించాయని వెల్లడైంది. దీంతో బర్డ్ ఫ్లూ సోకకుండా జిల్లా అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement