Abn logo
Mar 5 2021 @ 07:30AM

అహ్మదాబాద్ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ

అహ్మదాబాద్(గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది.అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు. బర్డ్ ఫ్లూ ప్రబలినందున కోడిగుడ్లు, కోళ్లను పూడ్చిపెట్టాలని జిల్లాకలెక్టర్ ఆదేశించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, మాంసం, చికెన్ అమ్మకాలను కొన్నాళ్లపాటు నిషేధించామని కలెక్టరు వివరించారు. 

Advertisement
Advertisement
Advertisement