ఓయూ పూర్వ విద్యార్థులకు బయోటెక్‌ గ్రాంట్‌

ABN , First Publish Date - 2022-08-06T09:24:03+05:30 IST

మిర్చి, మామిడి పంటలను నాశనం చేస్తున్న నల్లపురుగు తెగులుకు పరిష్కారం చూపేందుకు ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థులు రూపొందించిన బయోటెక్నాలజీ ఇన్నోవేషన్‌ ప్రతిష్ఠాత్మక గ్రాంట్‌ స్కీమ్‌కు ఎంపికైంది.

ఓయూ పూర్వ విద్యార్థులకు బయోటెక్‌ గ్రాంట్‌

నల్లపురుగు తెగులుపై పరిశోధనలు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మిర్చి, మామిడి పంటలను నాశనం చేస్తున్న నల్లపురుగు తెగులుకు పరిష్కారం చూపేందుకు ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థులు రూపొందించిన బయోటెక్నాలజీ ఇన్నోవేషన్‌ ప్రతిష్ఠాత్మక గ్రాంట్‌ స్కీమ్‌కు ఎంపికైంది. ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థులు డాక్టర్‌ పాపతోటి నరేంద్ర కుమార్‌, డాక్టర్‌ గాజుల ప్రభాకర్‌ నల్లపురుగు తెగులుపై సంయుక్తంగా పరిశోధనలు చేశారు. ప్రాథమికంగా చేసిన పరీక్షల్లో తెగులుకు కారణమైన నల్లపురుగును సమర్థంగా నిరోధించగలిగారు. ఈ ప్రాజెక్ట్‌ వివరాలను న్యూఢిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ)కి సమర్పించారు. మరిన్ని పరిశోధనలు చేసేందుకు కౌన్సిల్‌ వారికి రూ.50 లక్షల గ్రాంట్‌ను మంజూరుచేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ పరిశోధనలతో నల్లపురుగు తెగులును సమూలంగా నిర్మూలించి, రైతులకు మంచి రోజులు తీసుకొస్తామన్నారు.

Updated Date - 2022-08-06T09:24:03+05:30 IST