Sep 26 2021 @ 23:48PM

పర్వీన్‌బాబీ జీవిత కథతో వెబ్‌సిరీస్‌

సౌందర్య దేవతగా అభిమానుల మన్ననలు అందుకున్న బాలీవుడ్‌ దివంగత నటి పర్వీన్‌ బాబీ జీవిత కథతో త్వరలో ఓ వెబ్‌సిరీస్‌ తెరకెక్కనుందని సమాచారం. 1970-80 దశకంలో అత్యంత డిమాండ్‌  ఉన్న బాలీవుడ్‌ హీరోయిన్‌గా ఆమె కొనసాగారు. 2005లో ఆమె మరణించారు. పర్వీన్‌ బాబీ జీవితంపై కరిష్మా ఉపాద్యాయ రాసిన పుస్తకం ఆధారంగా నిర్మాత స్నేహా రజని ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. తొలుత సినిమాగా తెరకెక్కించాలనుకున్నా నిడివి ఎక్కువగా ఉండడంతో వెబ్‌సిరీస్‌గా తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు. పర్వీన్‌ బాబీ బాల్యం, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ఆమె జీవితంలో ఎత్తుపల్లాలను ఈ వెబ్‌సిరీస్‌లో చూపించనున్నారు.