బంజారాహిల్స్‪ గ్లో క్లినిక్‪లో బయోలాజికల్ రీచర్చే ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-30T02:26:32+05:30 IST

బంజరాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న గ్లో క్లినిక్‪లో.. డాక్టర్ వర్షిణి రెడ్డి ఆధ్వర్యంలో లక్జరీ కాస్మొటిక్ బ్రాండ్ బయోలాజికల్ రేచర్చే కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా

బంజారాహిల్స్‪ గ్లో క్లినిక్‪లో బయోలాజికల్ రీచర్చే ప్రారంభం

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న గ్లో క్లినిక్‪లో.. డాక్టర్ వర్షిణి రెడ్డి ఆధ్వర్యంలో లక్జరీ కాస్మొటిక్ బ్రాండ్ బయోలాజికల్  రేచర్చే కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా  డాక్టర్ వర్షిణి రెడ్డి మాట్లాడుతూ.. డర్మా కాస్మొటిక్ చికిత్స విధానం ద్వారా తక్షణమే కనిపించే ఫలితాలను చూడవచ్చని అన్నారు.  ఇందుకోసం చర్మ తీరును అప్పటికప్పుడు విశ్లేషిస్తామని అన్నారు. 


బయోలాజికల్ రేచర్చే వైద్య సలహా మండలి వైద్యులు స్టీఫన్ లిప్ మాట్లాడుతూ.. ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా చర్మ సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఉత్పత్తులను, అందుకు అవసరమైన నిపుణుల కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు అందం పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగిందని, అందుకు అనుగుణంగా వారి ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఇక్కడ చికిత్స విధానాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రీజియన్ మేనేజర్ రాఫెల్ పౌర్, రోహిత్ రెడ్డి, రష్మి వాడికే తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-04-30T02:26:32+05:30 IST