జీవ వ్యర్థాలపై నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2022-07-02T06:34:16+05:30 IST

జీవ వ్యర్థాలపై నిర్లక్ష్యం తగదని పొల్యూషన్‌బోర్డ్‌ ఇంజనీర్‌ పురుషోత్తంరెడ్డి అన్నారు. పట్టణంలోని డాక్టర్స్‌ కాలనీలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మునిసిపల్‌ అధికారులతో కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. జీవవ్యర్థాల తరలింపునకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.

జీవ వ్యర్థాలపై నిర్లక్ష్యం తగదు
రికార్డులను పరిశీలిసున్న అధికారులు

మిర్యాలగూడ అర్బన్‌, జూలై 1: జీవ వ్యర్థాలపై నిర్లక్ష్యం తగదని పొల్యూషన్‌బోర్డ్‌ ఇంజనీర్‌ పురుషోత్తంరెడ్డి అన్నారు. పట్టణంలోని డాక్టర్స్‌ కాలనీలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మునిసిపల్‌ అధికారులతో కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. జీవవ్యర్థాల తరలింపునకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు జీవ వ్యర్థాలను మునిసిపల్‌ చెత్తబండ్లలో వేస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన రోమా బయోకెమికల్‌, వ్యర్థాల మేనేజ్‌మెంట్‌ సంస్థ జీవ వ్యర్థాల నిర్వహణ చూస్తున్నట్టు తెలిపారు. పట్టణంలోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్‌ పొందకుండా జీవవ్యర్థాల తరలింపులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులొచ్చాయన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రులకు నోటీసు లు జారీచేస్తామని, లైసెన్స్‌ రద్దుచేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్స్‌కాలనీలో 15 ఆస్పత్రుల్లో తనిఖీలు పూర్తిచేసినట్లు తెలిపారు. తనిఖీల్లో  వైద్యారోగ్యశాఖ జిల్లా డెమో ఆఫీసర్‌ రవీశంకర్‌, మునిసిపల్‌ ఇంజనీర్‌ శ్వేతరెడ్డి, హెల్త్‌అసిస్టెంట్‌ కిరణ్‌, అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:34:16+05:30 IST