పాక్స్‌లోవిడ్‌ ఇంటర్మీడియేట్‌ తయారీలోకి బయోఫోర్‌

ABN , First Publish Date - 2022-01-20T06:19:30+05:30 IST

పాక్స్‌లోవిడ్‌ ఇంటర్మీడియేట్‌ తయారీలోకి బయోఫోర్‌

పాక్స్‌లోవిడ్‌ ఇంటర్మీడియేట్‌ తయారీలోకి బయోఫోర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): యాంటీ కొవిడ్‌ చికిత్స ఔషధం పాక్స్‌లోవిడ్‌ తయారీకి అవసరమైన యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌ (ఏపీఐ)లోని ఇన్‌గ్రిడియెంట్‌ నిర్మాట్రెల్విర్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్‌ దేశీయంగా తయారు చేయనుంది. ఇందుకోసం రక్షిత్‌ గ్రూప్‌తో చేతులు కలిపింది. పాక్స్‌లోవిడ్‌ తయారీకి అవసరమైన ముడి ఔషధాలను ప్రస్తుతం ఇతర దేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. దేశీయంగా నిర్మాట్రెల్విన్‌ తయారు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై గణనీయంగా తగ్గుతుందని బయోఫోర్‌ సీఈఓ జగదీశ్‌ బాబు తెలిపారు. నిర్మాట్రెల్విన్‌ను యూఎస్‌ ఎఫ్‌డీఏ అనుమతి పొందిన యూనిట్‌లో తయారు చేయనున్నామని.. అనుమతి కోసం త్వరలోనే డీసీజీఐకి దరఖాస్తు చేయనున్నట్లు చెప్పారు. అనుమతి లభించిన వెంటనే దేశీయ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉందని అన్నారు. 

Updated Date - 2022-01-20T06:19:30+05:30 IST