ఫిబ్రవరి 24, 25న బయో ఆసియా సదస్సు

ABN , First Publish Date - 2022-01-25T07:38:57+05:30 IST

హైదరాబాద్‌ ప్రతి ఏడాది ఆతిథ్యం ఇస్తున్న బయో ఆసియా సదస్సును ఈసారి

ఫిబ్రవరి 24, 25న బయో ఆసియా సదస్సు

‘ఫ్యూచర్‌ రెడీ’ అంశంపై నిర్వహణ: కేటీఆర్‌


 హైదరాబాద్‌ ప్రతి ఏడాది ఆతిథ్యం ఇస్తున్న బయో ఆసియా సదస్సును ఈసారి కరోనా పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా వర్చువల్‌ విధానంలో నిర్వహించనున్నారు. బయో టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ 19వ ఎడిషన్‌ బయో ఆసియా సదస్సు ఫిబ్రవరి 24, 25 తేదీల్లో జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ సోమవారం తెలిపారు. లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమ, భవిష్యత్తు వ్యూహాన్ని రూపొందించడమే లక్ష్యంగా ఈసారి సదస్సును ‘ఫ్యూచర్‌ రెడీ’ అంశంపై నిర్వహించనున్నామని పేర్కొన్నారు. బయో టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు చెందిన 70దేశాల నుంచి ఫార్మా, బయోటెక్‌ కంపెనీల ఉన్నతాధికారులు, నిపుణులు, పరిశోధకులు దాదాపు 30 వేల మంది ఇందులో పాల్గొననున్నారని అన్నారు. 


Updated Date - 2022-01-25T07:38:57+05:30 IST