ప్చ్.. బ(భ)యో మెట్రిక్!
ABN , First Publish Date - 2021-07-27T06:03:20+05:30 IST
వైఎస్సార్ ఆసరా పథ కంలో డ్వాక్రా రుణ మాఫీ మం జూరుకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు.
కరోనా అదుపులోకి వస్తున్న వేళ కొందరిలో నిర్లక్ష్యం
ఆసరా పథకంలో డ్వాక్రా రుణ మాఫీ మంజూరుకు మహిళల పాట్లు
పాయకరావుపేట, కోటవురట్ల వెలుగు కార్యాలయాల వద్ద గుంపులు
పాయకరావుపేట/ కోటవురట్ల, జూలై 26 : వైఎస్సార్ ఆసరా పథ కంలో డ్వాక్రా రుణ మాఫీ మం జూరుకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. వేలి ముద్ర వేసేందుకు సోమవారం పాయ కరావుపేట, కోటవురట్లలోని వెలుగు కార్యాలయానికి డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వీరంతా కనీస భౌతిక దూరం పాటించడాన్ని విస్మరిం చారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో ఇలా గుమి గూడి ఉండడాన్ని చూసినవారు ఆందో ళన చెందుతున్నారు. అసలే మండలం లోని పలు గ్రామాల్లో అక్కడక్కడ కొవిడ్ కేసులు బయటపడు తున్నాయని, ఈ తరుణంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిదని సూచి స్తున్నారు. ఇదిలావుంటే, అధికారులు సైతం వీరు భౌతిక దూరం పాటించేలా సరైన ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం.