బయోఫోర్‌ ‘ఫావిపిరావిర్‌’కు అనుమతి

ABN , First Publish Date - 2020-07-15T05:37:21+05:30 IST

కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించే ఫావిపిరావర్‌ ఏపీఐ తయారీకి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి లైసెన్స్‌ అందుకున్నట్లు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బయోఫోర్‌ ఇండియా ఫార్మాసుటికల్స్...

బయోఫోర్‌ ‘ఫావిపిరావిర్‌’కు అనుమతి

హైదరాబాద్‌: కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించే ఫావిపిరావర్‌ ఏపీఐ తయారీకి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి లైసెన్స్‌ అందుకున్నట్లు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బయోఫోర్‌ ఇండియా ఫార్మాసుటికల్స్‌ వెల్లడించింది. ఫినిష్డ్‌ ఫార్ములేషన్‌లో ఉపయోగించే యాక్టివ్‌ ఫార్మాఇన్‌గ్రిడియెంట్‌ (ఏపీఐ) తయారీకి డీసీజీఐ అనుమతినివ్వటమే కాకుండా ఎగుమతులకు ఆమోదం తెలిపిందని కంపెనీ పేర్కొంది. అలాగే స్థానిక భాగస్వామితో కలిసి ఏపీఐని ఎగుమతి చేసేందుకు టర్కీ నుంచి అనుమతి లభించిందని తెలిపింది. మరోవైపు పలు భారతీయ భాగస్వాములతో కలిసి ఈ ఔషధాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్చలు సాగిస్తున్నట్లు బయోఫోర్‌ వెల్లడించింది. 


Updated Date - 2020-07-15T05:37:21+05:30 IST