బిందె నిండదు.. దాహం తీరదు

ABN , First Publish Date - 2022-05-11T05:53:53+05:30 IST

మండల కేంద్రం కోసిగిలోని 3వ వార్డులో ఉన్న దుర్నిగేని గేరి, పోతులగేరి పర్సయ్యగేరి కాలనీల్లో ఎనిమిది రోజుల నుంచి తాగునీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆ కాలనీకి చెందిన మహిళలు కాలనీవాసులు ఆవదేన వ్యక్తం చేశారు.

బిందె నిండదు.. దాహం తీరదు
కోసిగిలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ఎదురు చూస్తున్న కాలనీవాసులు

ఎనిమిది రోజులుగా తాగునీటి సరఫరా బంద్‌ 

ఇబ్బందుల్లో 3వ వార్డు వాసులు


కోసిగి, మే 10: మండల కేంద్రం కోసిగిలోని 3వ వార్డులో ఉన్న దుర్నిగేని గేరి, పోతులగేరి పర్సయ్యగేరి కాలనీల్లో ఎనిమిది రోజుల నుంచి తాగునీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆ కాలనీకి చెందిన మహిళలు కాలనీవాసులు ఆవదేన వ్యక్తం చేశారు. తాగునీటి పైపులైను ఉన్నా నీరు రాకపోవడంతో బిందెలు నింపుకోవడానికి ఎదురు చూస్తున్నామనీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ నాయకుడు కూడా తమ కాలనీవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులకు, అధికారులకు నిర్లక్ష్యం చూపుతున్నారని, ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఎనిమిది రోజులుగా తాగునీరు లేక ఇతర కాలనీలకు వెళ్లి తెచ్చుకుంటున్నామని అన్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.


ఆర్‌.కొట్టాలలో తాగునీటి ఎద్దడి


తుగ్గలి, మే 10: మండలంలోని రాంపురం కొట్టాలలో మంగళవారం తాగునీరు రాకపోవడంతో కొళాయిల వద్ద గంటలు తరబడి మహిళలు ఎదురు చూడాల్సి వచ్చింది. దీంతో వారు మాట్లాడుతూ గ్రామానికి తాగునీరందించే బోరు సక్రమంగా పని చేయడం లేదని, పనులు మానుకుని గంటలు తరబడి కొళాయిల వద్ద ఉంటే తప్ప నీరు దొరకడం లేదని గ్రామస్థులు పోయారు. గ్రామానికి తాగునీరు అందించే బోరుకు ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌కు ఇతరులు కనెక్షన్‌లు ఇవ్వడంతో మోటర్లు కాలిపోయి నీరు అందడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. 

Read more